సోనియా నిర్ణయంతో తెలంగాణ ఆవిర్భావం

కామారెడ్డి, నవంబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోనియాగాంధీ నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిరదని తెలంగాణ రాష్ట్ర మిచ్చిన కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని ఎల్లారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి మదన్మోహన్‌ కోరారు. బుధవారం రామారెడ్డి మండల కేంద్రంలో గడపగడపకు మదన్‌ మోహన్‌ కార్యక్రమం నిర్వహించారు. కాలభైరవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు. మండల కేంద్రంలో మాట్లాడుతూ, 29వ రాష్ట్రంగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరణతో గెలిపించాలని చేతి గుర్తుకు ఓటేయాలని కోరారు.

యువతకు ఉద్యోగ కల్పన పేదలకు సొంత ఇంటి సాకారంకోసం అంకిత భావంతో కృషి చేస్తానన్నారు. 60 మంది యాదవ సంఘ సభ్యులు కాంగ్రెస్‌లో చేరగా వారికి కండువా కప్పి ఆహ్వానం పలికారు. గులాబీ పార్టీ కార్యకర్తలకే దళిత బంధు బీసీ బందు మైనారిటీ బందు పథకాలు అందుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలో కొస్తే 6 గ్యారెంటీ హామీలతో అన్ని వర్గాల ప్రజలకు లబ్ది చేకూరుతుందన్నారు. ప్రతి మహిళకు నెలకు 3వేలు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, రైతులకు ఏడాదికి 15వేలు, రైతు కూలీలకు 12వేలు, 500 రూపాయలకి గ్యాస్‌ సిలిండర్‌ అందజేస్తామని హామీ ఇచ్చారు.

ప్రాణాలకు తెగించి కోవిడ్‌ ఆపత్కాలంలో వందల మంది ప్రాణాలు కాపాడానని మదన్‌ మోహన్‌ చెప్పారు. గ్రామ గ్రామాన అంబులెన్స్‌ ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలని పేర్కొన్నారు. రామారెడ్డిలో కనీస సౌకర్యాలు లేవని రోడ్లు మురికికాలువలు లేవన్నారు. డబుల్‌ బెడ్రూంలు యువతకు ఉద్యోగాలు లేవని గుర్తు చేశారు. 30 ఏళ్ల క్రితం రామారెడ్డి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని చెప్పారు. తాను గెలిచి అమెరికా పోతానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని మదన్‌ మోహన్‌ చెప్పారు.

జాబ్‌ మేళాలు నిర్వహించి వందల మంది యువతకి ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. 18 దేశాలలో సొంత కంపెనీలు ఉన్న ప్రజా సేవ కోసం ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని ప్రజాసేవకు అంకితం అవుతానని హామీ ఇచ్చారు.

Check Also

డిగ్రీ కళాశాలలో యన్‌సిసి సంబరాలు

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »