నిజామాబాద్, నవంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మేరీ మాటి మేరా దేశ్ పేరుతో జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి సేకరించిన మట్టిని ఢల్లీిలోని అమృత్ కాల్ స్మారక నిర్మాణ స్థలానికి చేరుకుంది. తెలంగాణ రాష్ట్రం యొక్క అన్ని జిల్లాల నుంచి ఢల్లీికి వెళ్లిన వలంటీర్ల బృందానికి రాష్ట్ర ఇంఛార్జిగా శైలి బెల్లాల్ వ్యవరించారు.
నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో అన్ని మండలాల నుంచి ఎంపిక చేయబడిన వాలంటీర్లు నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైల్లో ఢల్లీి వెళ్లి, అక్కడ ఏర్పాటు చేసిన అమృత కలశంలో సమర్పించారు.
స్వాతంత్య్ర భారత అమృతోత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుండి సేకరించిన మట్టితో అమృత కాల స్మారకాన్ని నిర్మించనున్నారని శైలి బెల్లాల్ తెలిపారు.
ఈ సందర్భంగా నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లా నుంచి వెళ్లిన వాలంటీర్ల బృందం నెహ్రూ యువ కేంద్ర డైరెక్టర్ జనరల్‌కి రెండు జిల్లాల మట్టి కలశాలను అందించారు.
ఉమ్మడి జిల్లాలోని అన్ని గ్రామాలు, నగరాల నుంచి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు,ఉద్యోగులు, విద్యార్థులు, మాజీ సైనికులు అందరూ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని వారందరికీ ఈ కార్యక్రమ సమన్వయకర్తగా వ్యవహరించిన శైలి బెల్లాల్ ధన్యవాదాలు తెలిపారు.