కామారెడ్డి, నవంబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నాణ్యతా ప్రమాణాలకనుగుణంగా రైతుల నుండి ధాన్యం సేకరించి ట్యాగింగ్ చేసిన రైస్ మిల్లులకు ధాన్యం తరలించవలసినదిగా పౌర సరఫరాల కమీషనర్ అనిల్ కుమార్ ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు సూచించారు. అదనపు కలెక్టర్ చంద్ర మోహన్‌తో కలిసి శుక్రవారం బస్వాపూర్, బిక్కనూర్, అంతంపల్లిలో కొనుగోలు కేంద్రాలను, సిద్ధిరామేశ్వర బాయిల్డ్ రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కేంద్రం నిర్వాహకులనుదేశించి మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని, ధాన్యం తూర్పారబట్టుటకు ప్యాడి క్లీనర్ లు, గన్ని బ్యాగులు అందించాలని, ఎటువంటి తరుగు తీయరాదని, అన్నారు. అనంతరం రైస్ మిల్లును సందర్శించి ధాన్యం వచ్చిన వెంటనే ఆన్ లోడ్ చేసుకోవాలని ఎటువంటి అభ్యంతరాలు చెప్పరాదని, లారీలను త్వరగా పంపించాలని,కోరారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ కు వచ్చన కమీషనర్ అనిల్ కుమార్ ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
కార్యక్రమంలో పౌర సరఫరాల జిల్లా మేనేజర్ అభిషేక్ సింగ్, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, ఇంచార్జి డిసిఓ సింహ చలం, సహాయ పౌర సరఫరాల ద్దదికారి నిత్యానంద, డిప్యూటీ తహశీల్ధార్ కిష్టయ్య పాల్గొన్నారు.