కామారెడ్డి, నవంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లాకు నియమించిన వ్యయ పరిశీలకులు పర శివమూర్తి శనివారం ఎలారెడ్డి నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటించి అధికారులకు, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలకు వ్యయ పర్యవేక్షణపై తగు సూచనలు ఇచ్చారు. ముందుగా ఎల్లారెడ్డి రిటర్నింగ్ కార్యాలయాన్ని సందర్శించి సహాయ వ్యయ పరిశీలకులకు, ఎన్నికల పర్యవేక్షణకు సంబంధించి అకౌంటింగ్ బృందానికి పలు సూచనలు ఇచ్చారు.
అనంతరం తాడ్వాయి, లింగంపేటలో ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను సందర్శించి ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చులపై పర్యవేక్షణ ఉండాలన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా గట్టినిఘా ఉంచాలన్నారు. బ్యాంకుల ద్వారా పెద్దమొత్తంలో జరిగి లావాదేవీలను పరిశీలించాలన్నారు.
ఎన్నికలలో మద్యం, నగదు, కానుకలు పంపిణి జరగకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలన్నారు. అకౌంటింగ్ బృందం నిర్వహించే షాడో రిజిస్టర్ అభ్యర్థి ఖర్చు రిజిస్టర్ ప్రకారం సరిపోల్చుకోవాలన్నారు. రిజిస్టర్ నిర్వహణతీరుపై అభ్యర్థులకు అవగాహన కలిగించాలన్నారు.