కామారెడ్డి, జూలై 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణం శ్రీరాం నగర్ కాలనీలో గల కౌసల్య మల్టి స్పెషాలిటీ హాస్పిటల్ లో గర్బస్థ పిండ నిర్దారణ పరీక్షలు జరుపుతున్నట్లు సమాచారం అందడంతో రాష్ట్ర స్థాయి నోడల్ అధికారి, సీనియర్ ప్రోగ్రాం అధికారి- పి.సి., పి.ఎన్. డి. టి. డా.సూర్యశ్రీ రావు జిల్లా ప్రోగ్రాం అధికారి డా.శిరీష, ఇతర అధికారులు డేకాయ్ ఆపరేషన్ చేయగా అట్టి హాస్పిటల్‌లో గర్భిణీకి పిండ నిర్ధారణ స్కానింగ్ చేసి కడుపులో ఉన్నది ఆడ / మగ అని చెపుతున్న విషయం నిజమే అని నిర్దారణ అయ్యింది.
సదరు ఆసుపత్రిలో అర్హత లేని వారు స్కానింగ్ చేయడం, గర్భ విచ్చితి (అబార్షన్) చేయడం, ఇట్టి ఆసుపత్రికి స్కానింగ్ సెంటర్‌కు రిజిస్ట్రేషన్ లేనందున జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆసుపత్రిని కామారెడ్డి తహసీల్దార్, ఇతర సిబ్బందితో సీజ్ చేశారు. ఇట్టి ఆసుపత్రికి యాజమాన్యం పైన పిసి, పిఎన్‌డిటి (గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్ష) చట్టం ప్రకారం కేసు పెట్టుటకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం జరిగిందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. చంద్రశేఖర్ తెలిపారు