కామారెడ్డి, నవంబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని మీడియా సర్టిఫికేషన్, మానిటరీ కమిటీ కంట్రోల్ రూమ్ ఆదివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ఓటర్ హెల్ప్ లైన్, సి విజిల్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సోషల్ మీడియాలో, టీవీ ఛానళ్లు, దినపత్రికల్లో వచ్చిన ప్రకటనల వివరాలు అడిగారు. వచ్చిన ప్రకటనల వివరాలను ఎప్పటికప్పుడు రికార్డులో నమోదు చేయాలని సూచించారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ అనుమతులు లేకుండా ఇలాంటి ప్రకటనలు వేయరాదని చెప్పారు. వేసిన పార్టీలపై, అభ్యర్థులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో నోడల్ అధికారి సతీష్ యాదవ్, అధికారులు పాల్గొన్నారు.