మూడు కిలోల గంజాయి స్వాధీనం

బాన్సువాడ, నవంబర్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ ఎక్సైజ్‌ పరిధిలో అక్రమంగా గంజాయి అమ్ముతున్న వారిని పట్టుకొని విచారించగా బాన్సువాడకు చెందిన వెంకటేష్‌ను పిట్లం, కల్లెర్‌ మండలం మారడి గ్రామానికి చెందిన బాలప్ప, పిట్లం మండలానికి చెందిన ఇబ్రహీం, రాజుల వద్ద 3 కిలోల 200 గ్రాముల ఎండు గంజాయిని వారి వద్ద నుండి జప్తు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎక్సైజ్‌ సీఐ యాదగిరి రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమంగా గంజాయి తరలించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయన్నారు. కార్యక్రమంలో సీఐ యాదగిరి రెడ్డి, ఎస్సై తేజస్విని, ఎక్సైజ్‌ సిబ్బంది షరిపోద్దీన్‌, విట్టల్‌, సందీప్‌, శ్రీకాంత్‌, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, ఏప్రిల్‌.11, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »