కామరెడ్డి, నవంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముదిరాజ్ అభివృద్ధికి, ముదిరాజులు రాజకీయంగా ఎదిగేందుకు కేసిఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ప్రభుత్వ గంప గోవర్ధన్ అన్నారు.
సోమవారం శుభం ఫంక్షన్ హాల్లో జరిగిన ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించారు. గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా ముదిరాజులకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. కానీ కెసిఆర్ కేటీఆర్ ముదిరాజుల కోసం సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో కామారెడ్డిలో కేసీఆర్కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు.
గెలిచిన వెంటనే ముదిరాజుల సమస్యల పరిష్కారానికి తమ బాధ్యత తీసుకుంటామని అన్నారు, ఇప్పటివరకు తనకు మండలి చైర్మన్గా ఆకాశం ఇచ్చారని రాబోయే రోజుల్లో కార్పోరేషన్ ఎమ్మెల్సీలకు ముదిరాజులకు కేటాయించడం జరుగుతుందన్నారు. జిల్లా అధ్యక్షుడు పునరాజేశ్వర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నియోజకవర్గంలోని సుమారు 1500 మంది ముదిరాజులు పాల్గొన్నారు.