కామారెడ్డి, జూలై 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో పాత పెన్షన్లు పొందుతున్న వృద్ధ కళాకారులు తమ యొక్క లైఫ్ సర్టిఫికెట్లను నూతన కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయంలో ఈనెల 22 లోగా అందజేయాలని జిల్లా పౌర సంబంధాల అధికారి పి. వెంకటేశ్వర రావు ఒక ప్రకటనలో తెలిపారు.
వృద్ధ కళాకారుల పెన్షన్ 1500 నుండి 3016 రూపాయలు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడినాయని తెలిపారు. రాష్ట్ర భాషా సాంస్క ృతిక శాఖ ద్వారా పెన్షన్లు పొందుతున్న వృద్ధ కళాకారులు తమ యొక్క లైఫ్ సర్టిఫికెట్లతో పాటు ఇతర పెన్షన్లు పొందడం లేదని మండల అభివృద్ధి అధికారి ధ్రువీకరణ పత్రం అందజేయాలని ఆయన అట్టి ప్రకటనలో తెలిపారు.