బాన్సువాడ, నవంబర్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించే బీసీ గర్జన సభకు నరేంద్ర మోడీ నాయకతాన్ని బలపరిచేందుకు బాన్సువాడ నియోజకవర్గం నుండి బిసి నాయకులు బిసి కులస్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.
ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీసీలకు ఎక్కువ కేంద్ర మంత్రి పదవులు కేటాయించడం జరిగిందని, బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు పైడిమల్ లక్ష్మీనారాయణ, గుడు గుట్ల శ్రీనివాస్, శంకర్ గౌడ్, సాయిబాబా, కొండని గంగారం, శివశంకర్, నాంపల్లి శ్యామ్, సంతోష్, దత్తు సాయిలు తదితరులు పాల్గొన్నారు.