నిజామాబాద్, నవంబర్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మంగళవారం రోజున 13 నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారులు తెలిపారు. ఆర్మూర్ సెగ్మెంట్ నుండి ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థిగా చెరుకు ప్రేమ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పి.వినయ్ కుమార్ రెడ్డి నామినేషన్లను సమర్పించారు.
బోధన్ సెగ్మెంట్ నుండి సయ్యద్ అస్గర్ (స్వతంత్ర), జునైద్ అహ్మద్ ఖలీల్ (స్వతంత్ర) నామినేషన్ వేయగా, బాన్సువాడ సెగ్మెంట్ నుండి బీ.ఎస్.పీ అభ్యర్థిగా నీరడి ఈశ్వర్, బీ.ఆర్.ఎస్ అభ్యర్థిగా పరిగే శ్రీనివాస్ రెడ్డి రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి రాగి అనిల్ (స్వతంత్ర), ఫజల్ కరీం (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ), రాపెల్లి శ్రీనివాస్ (స్వతంత్ర) నామినేషన్లను దాఖలు చేశారు. నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ నుండి పి.తిరుపతి రెడ్డి (స్వతంత్ర), బాజిరెడ్డి జగన్మోహన్ (స్వతంత్ర), కె.సుభాష్ (ధర్మసమాజ్ పార్టీ), ఆర్.ప్రశాంత్ (ధర్మసమాజ్ పార్టీ) అభ్యర్థులుగా నామినేషన్లు సమర్పించారు.
బాల్కొండ నియోజకవర్గం నుండి ఈ రోజున ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదని రిటర్నింగ్ అధికారి తెలిపారు. కాగా, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయిన నాటి నుండి ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 37 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆర్మూర్ సెగ్మెంట్ నుండి నేటి వరకు 6 నామినేషన్లు దాఖలు కాగా, బోధన్ సెగ్మెంట్ లో 6 , బాన్సువాడలో 6, నిజామాబాద్ అర్బన్‌లో 10, నిజామాబాద్ రూరల్‌లో 6, బాల్కొండ నియోజకవర్గంలో 3 నామినేషన్లు దాఖలయ్యాయి.