బాన్సువాడ, నవంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కాసుల బాలరాజ్ ఇటీవల అధిష్టానం కాంగ్రెస్ పార్టీ టికెట్ స్థానికేతరులకు కేటాయించడంతో మనస్థాపం చెంది బుధవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి, మధ్యలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి పురుగుల మందు సేవించి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు.
వెంటనే స్థానికులు గమనించి హుటాహుటిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి ఆయన అభిమానులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వందలాదిగా రావడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.