బాన్సువాడ, నవంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఏసీబీ వలలో బాన్సువాడ సబ్ రిజిస్టర్ సతీష్‌ను బుధవారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే బాన్సువాడ పట్టణానికి చెందిన ఉమామహేశ్వరరావు తన పాత ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ గురించి సబ్ రిజిస్టర్ సంప్రదించగా ముగ్గురు అన్నదమ్ములు పేరున తల్లిదండ్రుల ఆస్తి మార్పిడి చేయడానికి 15 వేలు డిమాండ్ చేసినట్లు డిఎస్పి తెలిపారు.
రిజిస్టర్‌కి ఇప్పటికే అన్ని ఖర్చులు భరిస్తూ ఉన్నామని బతిమిలాడిన ఒప్పుకోకపోవడంతో ఉమామహేశ్వరరావు ఫిర్యాదు మేరకు 9 వేలు అటెండర్ యూనుస్ డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు డి.ఎస్.పి ఆనంద్ తెలిపారు. ఏసీబీ అధికారులు కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.
నిజామాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పనిచేసిన సమయంలో రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో కారణంపై సస్పెన్షన్‌కు గురి అయ్యారు. ఇటీవల తిరిగి విధుల్లో చేరిన సతీష్‌ను బాన్సువాడకు బదిలీ చేశారు. ఇక్కడ కూడా తీరు మారకపోవడం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కడం విశేషం. తనిఖీలో నిజామాబాద్, మెదక్ ఏసిబి అధికారులు సిఐ శ్రీనివాస్, సబ్ ఇన్స్‌పెక్టర్లు నాగేష్, వెంకటరాజా గౌడ్, తదితరులున్నారు.