నిజామాబాద్, నవంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్ర శాసనసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి బుధవారం రోజున 25 నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారులు తెలిపారు. ఆర్మూర్ సెగ్మెంట్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా నారాయణపేట రాజేష్, బీజేపీ అభ్యర్థిగా పైడి రాకేష్ నామినేషన్లను సమర్పించారు.
బోధన్ సెగ్మెంట్ నుండి వి.మోహన్ రెడ్డి(బీజేపీ), పి.గోపి కిషన్(శివసేన), ఎండి.యూసుఫ్ (స్వతంత్ర), సయ్యద్ అస్గర్ (స్వతంత్ర), పి.రజితవాణి (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), మోసిన్ (ఎం-సీపీఐ), బాన్సువాడ సెగ్మెంట్ నుండి కూనింటి రామ్ (స్వతంత్ర), కాసుల రోహిత్ (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్), కాసుల బాలరాజ్ (కాంగ్రెస్), యెండల లక్ష్మీనారాయణ (బీజేపీ), డి.సుభాష్ (స్వతంత్ర), షేక్ గౌస్ (స్వతంత్ర), గోపాల్ (ఎం-సీపీఐ), తోట శ్రీకాంత్(ధర్మ సమాజ్ పార్టీ) నామినేషన్లు దాఖలు చేశారు.
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి మౌలానా ఖాన్ (స్వతంత్ర), ఎండి.జహీరుద్దీన్ (ఎంబీటీ), లక్క అశోక్ (ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ), ధన్ పాల్ సూర్యనారాయణ (బీజేపీ), ఫజల్ క్రీం (కాంగ్రెస్) నామినేషన్లను దాఖలు చేశారు. నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ నుండి గుగులోత్ బాలరాజు (స్వతంత్ర), బీ.బీ.నాయక్ (స్వతంత్ర) అభ్యర్థులుగా నామినేషన్లు సమర్పించారు. బాల్కొండ నియోజకవర్గం నుండి ఏలేటి అన్నపూర్ణ (బీజేపీ), పల్లికొండ నర్సయ్య (బీఎస్పీ) అభ్యర్థులుగా నామినేషన్ వేశారు.
కాగా, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయిన నాటి నుండి ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 62 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆర్మూర్ సెగ్మెంట్ నుండి నేటి వరకు 8 నామినేషన్లు దాఖలు కాగా, బోధన్ సెగ్మెంట్ లో 12, బాన్సువాడలో 14, నిజామాబాద్ అర్బన్‌లో 15, నిజామాబాద్ రూరల్‌లో 8, బాల్కొండ నియోజకవర్గంలో 5 నామినేషన్లు దాఖలయ్యాయి.