కామారెడ్డి, నవంబర్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో మల్లవ (70) ఆపరేషన్ నిమిత్తమై ఏ పాజిటివ్ రక్తం రక్తం కేంద్రాలలో లభించకపోవడంతో పరిదీపెట్ గ్రామానికి చెందిన మోతే వంశీకృష్ణ రెడ్డి గవర్నమెంట్ వైద్యశాలలో మంత్రి ప్రవీణ్, మంత్రి భాను ప్రసాద్‌లు కామారెడ్డి బ్లడ్ సెంటర్లో సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు అన్నారు.
మానవ జీవితానికి సార్ధకత ఆపదలో ఉన్న వారికి సహాయం చేసినప్పుడే చేకూరుతుందని, ప్రతి ఒక్కరూ జీవితంలో ఆపదలో ఉన్న వారికి వీలైనంతవరకు సహాయం చేయాలన్నారు. నిస్వార్ధంగా ఏమి ఆశించకుండా ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేస్తున్న రక్తదాతలు నిస్వార్ధ సేవకులని అన్నారు. రక్తదానం చేసిన రక్తదాతలకు ఐవీఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున అభినందనలు తెలిపారు.