నిజామాబాద్, నవంబర్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్ర శాసనసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి గురువారం రోజున 33 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.
ఆర్మూర్ సెగ్మెంట్ నుండి ఎస్.కె.మాజిద్ (మజ్లీస్ బచావో తెహ్రీక్), ఆశన్నగారి జీవన్ రెడ్డి (బీ.ఆర్.ఎస్), తాళ్లపల్లి శేఖరయ్య (విద్యార్థుల రాజకీయ పార్టీ), గండికోట రాజన్న (బీ.ఎస్.పీ), పి. వినయ్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్) నామినేషన్లను సమర్పించారని, బోధన్ సెగ్మెంట్ నుండి పి.సుదర్శన్ రెడ్డి (కాంగ్రెస్), మోసిన్ (ఎం-సీపీఐ), డి.నాగరాజు (ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్), వి.మోహన్ రెడ్డి (బీజేపీ), మొహమ్మద్ షకీల్ ఆమిర్ (బీ.ఆర్.ఎస్), షేక్ జలీల్(స్వతంత్ర), సాయం మురళి (స్వతంత్ర) అభ్యర్థులుగా నామినేషన్లు వేశారని అన్నారు.
బాన్సువాడ సెగ్మెంట్ నుండి పరిగె భాస్కర్ రెడ్డి (స్వతంత్ర), పందిరి గంగామణి (స్వతంత్ర) అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారని అన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి మొహమ్మద్ షబ్బీర్ అలీ (కాంగ్రెస్), బి.లలిత(స్వతంత్ర), పడకంటి రాము (స్వతంత్ర), దత్తురామ్ ఖతల్ (రాష్ట్రీయ సమాజ్ పక్ష), దండి లత (బహుజన్ లెఫ్ట్ పార్టీ), బిగాల గణేష్ (బీ.ఆర్.ఎస్), ఫజల్ కరీం (ఎన్సీపీ), మహేష్ బిగాల (బీ.ఆర్.ఎస్), ఎం.శివకుమార్ (స్వతంత్ర), ధన్ పాల్ సూర్యనారాయణ (బీజేపీ), మొహమ్మద్ మన్సూర్ అలీ (అన్నా వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ) అభ్యర్థులుగా నామినేషన్లను దాఖలు చేశారని వివరించారు.
నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ నుండి బాజిరెడ్డి గోవర్ధన్ (బీ.ఆర్.ఎస్), బాజిరెడ్డి జగన్ మోహన్ (స్వతంత్ర), ఆర్.భూపతి రెడ్డి (కాంగ్రెస్), ఎం.శేఖర్ (బీ.ఎస్.పీ) అభ్యర్థులుగా నామినేషన్లు సమర్పించారని అన్నారు. బాల్కొండ నియోజకవర్గం నుండి వేముల ప్రశాంత్ రెడ్డి (బీ.ఆర్.ఎస్), పళ్ళికొండ నర్సయ్య (బహుజన సమాజ్ పార్టీ), ఎం.బోజన్న (ధర్మసమజ్ పార్టీ), ముత్యాల సునీల్ కుమార్ (కాంగ్రెస్) అభ్యర్థులుగా నామినేషన్ వేశారని కలెక్టర్ తెలిపారు.
కాగా, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయిన నాటి నుండి ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 70 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆర్మూర్ సెగ్మెంట్ నుండి నేటి వరకు 11నామినేషన్లు దాఖలు కాగా, బోధన్ సెగ్మెంట్‌లో 13, బాన్సువాడలో 8, నిజామాబాద్ అర్బన్‌లో 21, నిజామాబాద్ రూరల్‌లో 10, బాల్కొండ నియోజకవర్గంలో 7 నామినేషన్లు దాఖలయ్యాయి.