ఆర్మూర్, నవంబర్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఆర్మూర్ పట్టణంలోని విజయ్ హైస్కూల్లో 42వ టాలెంట్ షో సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ సినిమా ఆర్టిస్ట్ రాజశ్రీ, అలాగే ముఖ్య అతిథి రామ సంధిలియా పాల్గొన్నారు. వీరికి విజయ్ స్కూల్ యజమానురాలు డాక్టర్ అమృతలత సభ వేదికపై సన్మానం చేసారు.
అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులలో దాగివున్న కళ నైపుణ్యం బయటికి రావాలంటే ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ప్రాముఖ్యత చెందినదిగ పేర్కొన్నారు. ప్రతి సవత్సరం విజయ్ హైస్కూల్ ఆర్మూర్లో ఇలాంటి టాలెంట్ షో ప్రోగ్రాం జరగడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు పాటలు ఎంతో ప్రాముఖ్యం అన్నారు.
విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. వచ్చిన అతిథులకు విజయ్ స్కూల్ యాజమాన్యం గౌరవంగా సన్మానం చేసారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కవిత దివాకర్, కిరణ్ బాల, వసంత, పిల్లల తల్లి దండ్రులు, పెద్దలు, స్కూల్ యాజమాన్యం పాల్గొన్నారు.