నిజామాబాద్, నవంబర్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్ర శాసనసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి చివరి రోజైన శుక్రవారం నాడు 95 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఆర్మూర్ సెగ్మెంట్ నుండి సుంకే శ్రీనివాస్ (స్వతంత్ర), సుద్దపల్లి సుధాకర్ (స్వతంత్ర), బొంత సాయన్న (ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ), ఆర్.రవి (బలిరాజ పార్టీ), బి.భూమన్న (స్వతంత్ర), ప్రేమ్ కుమార్ (ధర్మ సమాజ్ పార్టీ), పైడి రాకేష్ రెడ్డి (బీజేపీ), జి.రాజేందర్ (కాంగ్రెస్), జి.రాజేందర్ (స్వతంత్ర) , చెంచుల అశోక్ (స్వతంత్ర), షేక్ మాజిద్ (మజ్లీస్ బచావో తెహ్రీక్), ఏ.జీవన్ రెడ్డి (బీఆర్‌ఎస్), జి.రాజన్న (బహుజన సమాజ్ పార్టీ), బూస రాకేష్ (ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్), పి.వినయ్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్), పి.రామకృష్ణ రెడ్డి (భారతీయ చైతన్య యువజన పార్టీ), చెన్న శ్రీమాన్ (స్వతంత్ర), కె.ప్రశాంత్ (స్వతంత్ర), ఆశన్నగారి రజిత రెడ్డి (బీఆర్‌ఎస్), తొగరి భూషణ్ (యోగ తులసి పార్టీ), కుంట జీవన్ (అలయన్స్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ), పి.సుచరిత రెడ్డి (స్వతంత్ర), కె.శ్రీనివాస్ (స్వతంత్ర), ఎన్.రాజేష్ (స్వతంత్ర) నామినేషన్లు దాఖలు చేశారని అన్నారు.
బోధన్ సెగ్మెంట్ నుండి సయ్యద్ అస్గర్ (స్వతంత్ర), పి.గోపి కిషన్ (శివసేన), ఎం.అమర్నాథ్ బాబు (బీ.ఎస్.పీ), గైని రాములు (ఇండియా ప్రజా బంధు పార్టీ), మొహమ్మద్ షకీల్ ఆమిర్ (బీ.ఆర్.ఎస్), డి.నాగరాజు (ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్), గంధం రాజేష్ (స్వతంత్ర), సాయం మురళి (ధర్మ సమాజ్ పార్టీ), హెచ్.భూపాల్ రెడ్డి (అలయన్స్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ), ఏ.సుదర్శన్ రాజ్ (స్వతంత్ర), టి.సురేందర్ (యోగ తులసి పార్టీ), టి.నవీన్ కుమార్ (స్వతంత్ర), మహమ్మద్ అర్షద్ పాషా (స్వతంత్ర), డి.సుదర్శన్ రెడ్డి (ఎన్సీపీ), ఎస్.పాండు (బీ.ఎస్.పీ) అభ్యర్థులుగా నామినేషన్లు వేశారని అన్నారు.
బాన్సువాడ సెగ్మెంట్ నుండి ఏనుగు రవీందర్ రెడ్డి (కాంగ్రెస్), రమావత్ అంబర్ సింగ్ (కాంగ్రెస్), బి.హన్మంత్ రెడ్డి(యోగ తులసి పార్టీ), బామన్ అమర్ సింగ్ (స్వతంత్ర), ఎన్.ఈశ్వర్ (బహుజన సమాజ్ పార్టీ), యెండల లక్ష్మీనారాయణ (బీజేపీ), కాసుల బాలరాజు (కాంగ్రెస్), వి.మల్యాద్రి (స్వతంత్ర), తోట శ్రీకాంత్ (ధర్మ సమాజ్ పార్టీ), మామిండ్ల రాజు (స్వతంత్ర) అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారని అన్నారు.
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి జి.ఓంశంకర్ (ధర్మ సమాజ్ పార్టీ), ఎన్.రాజేష్ (స్వతంత్ర), షబ్బీర్ అలీ (కాంగ్రెస్), రాపెల్లి శ్రీనివాస్ (స్వతంత్ర), రాగి అనిల్ (స్వతంత్ర), బిగాల గణేష్ (బీఆర్‌ఎస్), మహేష్ బిగాల (బీఆర్‌ఎస్), దండి లతా (బహుజన లెఫ్ట్ పార్టీ), వై.కన్నయ్య గౌడ్ (అలయన్స్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ), బి.నగావత్ రావు (స్వతంత్ర), వై.నరేందర్ గౌడ్ (యోగ తులసి పార్టీ), మహమ్మద్ అబ్దుల్ ఖదీర్ మొహియుద్దీన్ (ఇండియన్ ప్రజా కాంగ్రెస్), మొహమ్మద్ జఫర్ అలీ (తెలంగాణ జన సమితి), ఎం.రాజ్ కుమార్ (ఇండియా ప్రజా బంధు), ఫజల్ కరీం(స్వతంత్ర), షేక్ ఇమ్రాన్ (బీ.ఎస్.పీ), జి.సంజీవ్ (రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా), లక్క అశోక్ (ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ), ఎం.డి.షహీద్ ఖాన్(ఆలిండియా నేషనల్ రక్ష సేన), ధన్ పాల్ సూర్యనారాయణ (బీజేపీ), సుజాత రాథోడ్ (భారత చైతన్య యువజన పార్టీ), ఎం.డి.అజీమ్ ఖురైష్ (స్వతంత్ర), ఎం.శివకుమార్ (స్వతంత్ర), మొహమ్మద్ మన్సూర్ అలీ (అన్నా వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ), చింతల దశరథ్ (రాష్ట్రీయ సామాన్య ప్రజా అభ్యర్థులుగా నామినేషన్లను దాఖలు చేశారని వివరించారు.
నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ నుండి ఆర్.భూపతి రెడ్డి (కాంగ్రెస్), కె.దినేష్ కుమార్ (బీజేపీ), ఏ.సుఖేష్ కుమార్ (స్వతంత్ర), చిమర్ల రాజేశ్వర్ (స్వతంత్ర), ప్రసన్న కుమార్ (భారత చైతన్య యువజన పార్టీ), ఎం.శేఖర్ (బీ.ఎస్.పి), ఎం.రాజశేఖర్ (ఎం-సీపీఐ), బి.గంగారెడ్డి (స్వతంత్ర), రావుట్ల ప్రశాంత్ (ధర్మసమజ్ పార్టీ), తోట శ్రీనివాస్ (రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా) అభ్యర్థులుగా నామినేషన్లు సమర్పించారని అన్నారు.
బాల్కొండ నియోజకవర్గం నుండి వేముల ప్రశాంత్ రెడ్డి (బీ.ఆర్.ఎస్), ఏలేటి అన్నపూర్ణ దేవి (బీజేపీ), పళ్ళికొండ నర్సయ్య (బహుజన సమాజ్ పార్టీ), అబ్బగోని అశోక్ గౌడ్ (బహుజన లెఫ్ట్ పార్టీ), ఎం.బోజన్న (ధర్మసమజ్ పార్టీ), ముత్యాల సునీల్ కుమార్ (కాంగ్రెస్), శ్రీనివాస్ గద్దె (అలయన్స్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ), పి.యష్ పాల్ (యోగ తులసి పార్టీ), చెట్పల్లి శేఖర్ (భారత చైతన్య యువజన పార్టీ), ఈర్ల సాయిబాబు (స్వతంత్ర), కే.రఘునాథ్ (స్వతంత్ర) అభ్యర్థులుగా నామినేషన్ వేశారని కలెక్టర్ తెలిపారు.
కాగా, జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ముగిసే నాటికి మొత్తం 165 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆర్మూర్ సెగ్మెంట్ నుండి 35 నామినేషన్లు దాఖలు కాగా, బోధన్ సెగ్మెంట్ లో 28, బాన్సువాడలో 18, నిజామాబాద్ అర్బన్ లో 46, నిజామాబాద్ రూరల్‌లో 20, బాల్కొండ నియోజకవర్గంలో 18 నామినేషన్లు వచ్చాయి.