వేల్పూర్, జూలై 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూరు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు రమేష్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు హందాపూర్ రాజేష్ హాజరై మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న పథకాలు ప్రజలకు పూర్తి స్థాయిలో తీసుకువెళ్లి ప్రజలకు వివరించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని అన్నారు. బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు. సమావేశంలో మండల బిజెవైఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.