ఎన్నికల వ్యయ సంబంధిత అంశాలపై నేరుగా ఫిర్యాదులు చేయవచ్చు

నిజామాబాద్‌, నవంబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌, బాన్సువాడ శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల వ్యయ అంశాలపై తనకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల వ్యయ పరిశీలకులు తాన్యాసింగ్‌, ఐఏ Ê ఏఎస్‌, సూచించారు.

పై రెండు సెగ్మెంట్లలో ఎన్నికల వ్యయ సంబంధిత అంశాలతో ముడిపడిన ఏ విషయమైనా తన దృష్టికి తీసుకురావచ్చని ప్రజలకు సూచించారు. సెలవు దినాలలో మినహాయించి మిగతా అన్ని దినాలలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు తాను బోధన్‌ పట్టణంలోని ఇరిగేషన్‌ గెస్ట్‌ హౌస్‌లో అందుబాటులో ఉంటానని తెలిపారు.

ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు తనకు నేరుగా కలిసి బోధన్‌, బాన్సువాడ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ సంబంధిత అంశాలపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేయవచ్చని, సలహాలు, సూచనలు అందించవచ్చని పరిశీలకులు సూచించారు. నేరుగా కలిసేందుకు వీలుపడని వారు సెల్‌: 8332021892 కు ఫోన్‌ చేసి ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »