అవినీతిపరులను ఇంటికి పంపాలి…

బాన్సువాడ, నవంబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

బాన్సువాడ నియోజకవర్గంలో వారాస అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి కేవలం తన స్వార్ధ ప్రయోజనాల కోసం అభివృద్ధి పేరిట అవినీతి చేశారని వారిని ఇంటికి పంపాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు చైతన్య గౌడ్‌ అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

అవినీతి పాలనను అంతమొందించడానికి బాన్సువాడ ప్రజలు సిద్ధంగా ఉండాలని, కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగు రవీందర్‌ రెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు చేసింది శూన్యమన్నారు. అవినీతిపరులకు టికెట్లు కేటాయించిన కాంగ్రెస్‌ పార్టీ అవినీతి పార్టీ అని మరోసారి రుజువైందని, నీతి నిజాయితీ పరుడైన భాజపా అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ బాన్సువాడ ప్రజలు ఆశీర్వదించి ఓట్లు వేసి గెలిపించాలన్నారు.

కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఏదుబల్లే సాయికిరణ్‌, పట్టణ అధ్యక్షుడు గుడుగుట్ల శ్రీనివాస్‌, బీజేవైఎం నాయకులు సంజీవరెడ్డి, సతీష్‌ రెడ్డి, నాంపల్లి శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »