నిజామాబాద్, నవంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్ర శాసనసభ ఎన్నికలను పురస్కరించుకుని జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల పనితీరును ఆ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు శక్తి సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
బాల్కొండ, ఆర్మూర్ పట్టణాలతో పాటు మాక్లూర్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిర్వహిస్తున్న తనిఖీలు, ఇతర కార్యకలాపాలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పకడ్బందీగా అమలయ్యేలా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ, గట్టి నిఘా కొనసాగించాలని ఈ సందర్భంగా అబ్జర్వర్ సూచించారు. ఆయన వెంట జిల్లా ఎన్నికల వ్యయ కమిటీ నోడల్ అధికారి పాపయ్య తదితరులు ఉన్నారు.