వేల్పూర్, జూలై 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం మోతే గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో మోతే గ్రామానికి చెందిన మోతే గంగారెడ్డి రాష్ట్ర లేబర్ సోషల్ సెక్యూరిటీ మెంబర్గా నియమితులైన సందర్భంగా గ్రామ సర్పంచ్ రజిత చంద్రమోహన్ ఎంపీటీసీ డొల్ల సత్య రాణి ఆధ్వర్యంలో పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర సోషల్ సెక్యూరిటీ మెంబర్ మోతే గంగారెడ్డి మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృషి వల్ల రాష్ట్ర సోషల్ మెంబర్గా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందని, తనపై నమ్మకంతో రాష్ట్ర సోషల్ మెంబర్గా ఎన్నుకోవడం పట్ల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రజిత బాల్ రాజ్, పిఎసిఎస్ చైర్మన్ రాజేశ్వర్, టిఆర్ఎస్ నాయకులు మదన్, ప్రవీణ్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, విడిసి సభ్యులు పాల్గొన్నారు.