కామారెడ్డి, నవంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఎన్నికల కమీషన్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం రెండవ విడత ప్రిసైడిరగ్, సహాయ ప్రిసైడిరగ్, ఇతర పోలింగ్ సిబ్బంది బృందాల ఏర్పాట్లు ర్యాండమైజేషన్ ప్రక్రియ జిల్లాకు నియమించిన సాధారణ సాధారణ పరిశిలకులు ఛిఫంగ్ అర్థుర్ వర్చూయియో, జగదీశ్‌ల సమక్షంలో పారదర్శకంగా నిర్వహించామని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ తెలిపారు.
మంగళవారం కలెక్టరేట్ లోని యన్ .ఐ.సి. హాలు నందు జిల్లాలోని కామారెడ్డి, జుక్కల్, యెల్లారెడ్డి నియోజక వర్గాలతో పాటు బాన్సువాడ లోని మూడు మండలాలలో ఏర్పాటు చేస్తున్న 913 పోలింగ్ కేంద్రాలకు గాను ఎన్నికల కమీషన్ రూపొందించిన ఆన్‌లైన్ సాఫ్ట్‌వెర్ ద్వారా నిర్దేశించిన ప్రిసైడిరగ్, సహాయ ప్రిసైడిరగ్, ఇతర పోలింగ్ సిబ్బందినతో కూడిన 913 బృందాలను ఆయా నియోజక వర్గాలకు కేటాయిస్తున్నామని అన్నారు.
అదనంగా మరో 20 శాతం బృందాలను ఏర్పాటు చేసి సిద్ధంగా ఉంచుతున్నామన్నారు. ప్రతి నియోజక వర్గంలో ఐదు మహిళా పోలింగ్ స్టేషన్ల చొప్పున, బాన్సువాడ 2 మహిళా పోలింగ్ స్టేషన్లు, దివ్యంగులు, యువత కోసం ఒక్కో నియోజక వర్గంలో ఒక్కో ఆదర్శ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దివ్యంగుల కోసం ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రాలకు మాత్రం సిబ్బందిని మ్యానువల్ గా కేటాయిస్తున్నామన్నారు.
ప్రతి పోలింగ్ టీమ్‌లో ఒక మహిళా తప్పనిసరిగా ఉంటారని అన్నారు. మహిళా ప్రిసైడిరగ్ అధికారి ఉన్న దగ్గర సహాయ ప్రెసిడిరగ్ అధికారిగా పురుషులను నియమిస్తున్నామని కలెక్టర్ వివరించారు. ఉద్యోగి పనిచేస్తున్న చోట, స్వంత గ్రామం లేదా ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలలో వారికి విధులు కేటాయించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.
అదేవిధంగా ఒకే కార్యాలయంలోని ఇద్దరు సిబ్బందిని ఒకే పోలింగ్ కేంద్రానికి వేయకుండా చూశామన్నారు. నియోజక వర్గం వారీగా పోలింగ్ సిబ్బంది వివరాలను పరిశీలకులకు అందజేశారు. బృందాలకు ఈ నెల 21,22,23 తేదీలలో ఆయా నియోజక వర్గాలలో ఈ.వి.ఏం.లు, వివి ఫ్యాట్ యంత్రాల నిర్వహణ, మాక్ పోలింగ్, ఓటింగ్ యంత్రాలలో సాంకేతిక సమస్య తలెత్తితే ప్రత్యామ్నాయ చర్యలు తదితర అంశాలపై మాస్టర్ ట్రైనీలచే రెండవ విడత శిక్షణ ఇస్తామన్నారు. అదేవిధంగా ఈ నెల 24 న ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లోని సమావేశమందిరంలో మైక్రో అబ్జర్వర్‌లకు శిక్షణ ఇవ్వనున్నామన్నారు.
కార్యక్రమంలో మ్యాన్ పవర్ నోడల్ అధికారి రాజారామ్, రఘునందన్, యాన్.ఐ.సి. నెట్ వర్క్ ఫీల్డ్ ఇంజనీర్ శ్రీకాంత్, ఈడియం ప్రవీణ్ కుమార్, కలెక్టరేట్ ఏ.ఓ. మైసూర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.