కామారెడ్డి, నవంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్‌లు చురుకుగా పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం నిజాంసాగర్ రోడ్ లోని చెక్ పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన స్టాటిక్ సర్వేలెన్స్ బృందం నిర్వహిస్తున్న విధులను తెలుసుకొని పలు సూచనలు చేశారు. ఎన్నికల వేడి పుంజుకుంటున్న సందర్భంగా పెద్ద మొత్తంలో అక్రమంగా నగదు, మద్యం లేదా అనుమానాస్పదంగా వస్తువులు తరలిస్తుంటే తనిఖీ చేసి స్వాధీనం చేసుకోవాలని, వీటంతటిని విడియోగ్రఫీ చేసి డాక్యుమెంట్లను సాక్ష్యాలుగా భద్రపరచాలన్నారు.
కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్ ద్వారా 24 గంటలు పర్యవేక్షిస్తుంటామని, ఏ ఒక్క వాహనాన్ని వదలక ప్రతిదీ తనిఖీ చేస్తూ మాడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత నోడల్ అధికారులకు తెలపాలన్నారు.