కామారెడ్డి, నవంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
క్యాసంపల్లి ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు. ఇందులో విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానోపాధ్యాయురాలు గీత మాట్లాడుతూ విద్యార్థులందరూ సమయపాలన పాటిస్తూ నియమబద్ధతతో, కష్టపడే తత్వం అలవర్చుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు నరసింహారావు, సదాశివుడు, శ్రీనివాస్, అఖీల్ హుస్సేన్ సురేందర్ ప్రకాశం, మహేశ్వర్ గౌడ్, అజ్జు పాల్గొన్నారు.