కామారెడ్డి , నవంబర్ 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నామినేషన్ల ఉపసంహరణ అనంతరం జిల్లాలోని మూడు నియోజక వర్గాలలో 67 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కామారెడ్డి నియోజక వర్గంలో 64 మంది అభ్యర్థులకు గాను ఆరు నామినేషన్లు తిరస్కరణకు గురికాగా 19 మంది ఉపసంహరించుకున్నారని బరిలో 39 మంది అభ్యర్థులున్నారని అన్నారు. యెల్లారెడ్డి నియోజక వర్గంలో 16 మంది అభ్యర్థులకు గాను 2 నామినేషన్లు తిరస్కరించగా మరో ముగ్గురు ఉపసంహరించుకున్నారని బరిలో 11 మంది అభ్యర్థులున్నారని అన్నారు.
కాగా జుక్కల్ నియోజక వర్గంలో 30 మంది అభ్యర్థులకు గాను 6 నామినేషన్లను తిరస్కరించగా మరో 7 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నాక పోటీలో 17 మంది అభ్యర్థులు ఉన్నారని కలెక్టర్ పేర్కొన్నారు.
ఉపసంహరించుకున్న అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి..
యెల్లారెడ్డిలో పెద్ద మహేష్ అలియాస్ మోడిగామ మహేష్, నేనావత్ బద్యా నాయక్, బంతిలాల్ మంజలు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. జుక్కల్ నియోజక వర్గంలో రాంచందర్ బుక్కవార్, గంగారాం సౌదాగర్, రేవన్ సర్దేవార్, కరోళ్ల మోహన్, బక్కవార్ సాయిలు, సరిక మెక్కాయ్, గంగారాంలు ఉన్నారని ఆయన తెలిపారు.
కాగా కామారెడ్డి నియోజక వర్గంలో లింగాల ముత్యం, శివరాములు సాప, కలరామ్ అశోక్ వర్ధన్, గారెదె వెంకట్ రావు, చిట్టబోయిన నటరాజ, చిట్టబోయిన సులోచన రాణి, చిల్దుర సాగర్ రెడ్డి, చెట్పల్లి బాలరాజు, నిఖిల్ రెడ్డి, పప్పు రాజు, బిట్ల రాజయ్య, బుటెంగారి మాధవ రెడ్డి, బెల్లపురం సంతిష్ కుమార్, బ్రహ్మం ఆవుసుల, మహేందర్ రెడ్డి పంజెర్ల, రమేష్ కుమార్ చలిక, రాజేష్ పి .సుదర్శన్ ఆంద్రపు, సైదుర్గారి అశోక్ కుమార్లు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారని కలెక్టర్ పాటిల్ తెలిపారు.