అర్బన్‌ నియోజకవర్గానికి బ్యాలెట్‌ యూనిట్ల తరలింపు

నిజామాబాద్‌, నవంబర్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

శాసనసభ ఎన్నికల నిర్వహణ కోసం కట్టుదిట్టమైన భద్రత నడుమ శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్‌ నుండి నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గానికి బ్యాలెట్‌ యూనిట్లు తరలించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డిల పర్యవేక్షణలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పకడ్బందీ ఏర్పాట్ల నడుమ ఈవీఎంల తరలింపు ప్రక్రియ నిర్వహించారు.

సప్లిమెంటరీ రాండమైజేషన్‌ జాబితాను అనుసరిస్తూ బ్యాలెట్‌ యూనిట్లను అర్బన్‌ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి ఎం.మకరందుకు అప్పగించగా, పోలీసు బందోబస్తు నడుమ ప్రత్యేక వాహనాల్లో వాటిని నియోజకవర్గ కేంద్రానికి తరలించి స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపర్చారు. ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావులేకుండా ఈ.సీ సూచనలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా బ్యాలెట్‌ యూనిట్లను తరలించారు.

వాస్తవానికి ఇప్పటికే అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు ఈవీఎంల తరలింపు పూర్తయ్యింది. అయితే నిజామాబాద్‌ అర్బన్‌ సెగ్మెంట్లో 21 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండడంతో పోలింగ్‌ నిర్వహణ కోసం అదనపు బ్యాలెట్‌ యూనిట్లను ఏర్పాటు చేయడం అనివార్యమైంది.

దీంతో అర్బన్‌ సెగ్మెంట్‌ కు ఇదివరకు కేటాయించిన 361 బ్యాలెట్‌ యూనిట్లతో పాటు ప్రస్తుతం సప్లిమెంటరీ రాండమైజేషన్‌ నిర్వహించి, ఆ జాబితా ప్రకారంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో 361 బ్యాలెట్‌ యూనిట్లను కేటాయించారు. ఈ ప్రక్రియలో ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్‌, సాత్విక్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »