కామరెడ్డి, నవంబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పులు , ప్రతి కుటుంభానికి ఒక ఓటరు గైడ్ పుస్తకం పంపిణి జరిగేలా పర్యవేక్షించవలసినదిగా జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ సెక్టోరల్ అధికారులకు సూచించారు. శుక్రవారం కామారెడ్డి ఆర్.డి.ఓ. కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డితో కలిసి సెక్టోరల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు ఓటరు స్లిప్పుల పంపిణి, సి-విజిల్ యాప్ ప్రాముఖ్యత, 30న పోలింగ్ రోజు తప్పక ఓటు వేయడం తదితర అంశాలపై దిశా నిర్దేశం చేశారు.
బూత్ స్థాయి అధికారులు తమ వెంట వెంట ఓటరు జాబితాను తీసుకెళ్తు ప్రతి రోజు వంద నుండి 120 ఇళ్లు తిరిగి ఓటరు స్లిప్పులు, ఓటరు గైడు అందించడంతో పాటు సి-విజిల్ యాప్ ద్వారా ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఫిర్యాదు చేయుట, ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ డబ్బు, మద్యం పంపిణి చేయుట ఎన్నికల నియమావళికి నేరమని అవగాహన కలిగించాలని అన్నారు.
ఈ నెల 30 న ఓటర్లందరూ తమ బాధ్యతగా తప్పక ఓటు వేసేలా బూత్ స్థాయి అధికారులు ఓటర్లకు అవగాహాన కలిగించాలని, సెక్టోరల్ అధికారులు ప్రతి రోజు వారి పనితీరును పర్యవేక్షిస్తూ త్వరగా ఓటరు స్లిప్పులు పంపిణి జరిగేలా చూడాలన్నారు. ఈవిఎంల కమీషనింగ్‌లో పూర్తి సెక్టోరల్ అధికారుల భాద్యత కీలకమని, పూర్తి అవగాహన కలిగి ఉండాలని, పోలింగ్ రోజు అదనపు ఈవీఎంలతో ప్రెసిడిరగ్, సహాయ ప్రిసైడిరగ్ అధికారులను అందుబాటులో ఉండి ఏ సాంకేతిక సమస్య తలెత్తిన మార్చాలని అన్నారు.
ఏమైనా సందేహాలుంటే ఈ నెల 23,24 న ఈ.సి.ఐ. ఎల్ నుండి వచ్చే ఇంజనీర్లతో సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు. పోలింగ్ బూతులతో అన్ని సదుపాయాలను మరొకసారి పరిశీలించుకోవాలని, సమయమవుతున్న ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రాకుంటే విషం తెలుసుకొని సమస్య ఉంటె వెంటనే రిటర్నింగ్ అధికారికి తెలపాలన్నారు.
వెబ్ కాస్టింగ్‌తో పాటు సూక్ష పారిశీలకులు పోలింగ్ సరళిని పరిశీలిస్తుంటారని, ఎటువంటి ఏం.సి.సి. ఉల్లంఘన లేకుండా తటస్థంగా, నిజాయితీగా ఉండాలన్నారు. సమావేశంలో తహశీల్ధార్ లత, సెక్టోరల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.