డిచ్‌పల్లి, నవంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల పరిధిలోని డిగ్రీ పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. బి. ఎ ./ బీ.కాం./ బీ. ఎస్సీ./ బి బి ఏ కోర్సులకు ఒకటవ, మూడవ, ఐదవ రెగ్యులర్ సెమిస్టరుకు మరియు రెండవ, నాల్గవ,ఆరవ, బ్యాక్ లాగ్ సెమిస్టర్ పరీక్షలకు ఫీజు తేదీని ప్రకటించారు.
ఫీజు చెల్లించుటకు చివరి తేదీ 06-12-2023 వరకు 100 రూపాయల అపరాధ రుసుముతో 07-12-2023 చెల్లించాల్సి ఉటుందని పరీక్షల నియంత్రణాధికారిని ఆచార్య. ఎం.అరుణ తెలిపారు.
పూర్తి వివరాలకు సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌లను సంప్రదించాలన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు తెలంగాణ విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో పొందుపరచడం జరిగిందని కంట్రోలర్ తెలిపారు.