ఆర్మూర్, నవంబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం వల్లభపూర్ గ్రామస్తులు బిజెపి అధ్యక్షులు సచిన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున పైడి రాకేష్ రెడ్డి చేత బిజెపి కండువా కప్పుకున్నారు. సుమారు 70 మందికి పైగా బిజెపిలో చేరారు.
పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక్కసారి ఆశీర్వదించండి మీ వల్లభపూర్ గ్రామానికి ఉన్నత సేవలు చేస్తానని మరియు ఇల్లు లేని వారికి ఇల్లు కట్టిస్తానని ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తానని మరియు అనేక విధాలుగా మీ కష్టాల్లో అండగా తోడుగా ఉంటానని ఈసారి ఆర్మూర్ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పువ్వు గుర్తుకు ఓటు వేసే విధంగా గడపగడపకు మన మేనిఫెస్టో తీసుకువెళ్లి ప్రతి ఒక్కరిని మూడో నంబర్ పువ్వు గుర్తుకు ఓటు వేసే విధంగా చేయాలని వారు కోరారు.
కార్యక్రమంలో మేకల మహేష్, కోరుట్ల మహిపాల్, సంజీవ్, నగెళ్ళి సంజెయ్, సుధాకర్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.