కామారెడ్డి, నవంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టాలని కేంద్ర సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ కుమార్ వ్యాస్ అన్నారు. బుధవారం ఢల్లీి నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో శాసనసభ ఎన్నికల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కేంద్ర సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ నియోజకవర్గ ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేలా అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడంతో పాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ, ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ, ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ, బ్యాలెట్ పత్రాల ముద్రణ, ఈవిఎం యంత్రాల కమిషనింగ్, ఇంటి నుంచి ఓటు సేకరణ, పోలింగ్ సిబ్బంది శిక్షణ, రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ఏర్పాటు, తదితర అంశాలపై ఆయన జిల్లా కలెక్టర్ లకు పలు సూచనలు చేశారు.
కలెక్టరేట్ లోని యెన్.ఐ..సి కేంద్రం నుండి పాల్గొన్న జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ జిల్లాలోని ఓటర్లందరికి ఓటర్ సమాచార స్లిప్పులతో పాటు ఓటరు గైడ్, సి-విజిల్ యాప్ కరపత్రాలను పంపిణి చేస్తున్నామన్నారు. జుక్కల్ నియోజక వారంలో 17 మంది అభ్యర్థులకు గాను రెండు బ్యాలెట్ యూనిట్లు, కామారెడ్డి నియోజక వర్గంలో 39 మంది అభ్యర్థులకు గాను మూడు బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేస్తూ అందుకు అదనంగా అవసరమైన యూనిట్లను ప్రత్యేక యాదృచికరణ ద్వారా కేటాయించామని, ప్రిసైడిరగ్, సహాయ ప్రిసైడిరగ్ అధికారులకు రెండవ విడత శిక్షణ నేటితో పూర్తి చేశామని, సూక్ష్మ పరిశీలకులకు ఈ నెల 24 న సాధారణ పరిశీలకుల శిక్షణ ఇవ్వనున్నామని అన్నారు.
జిల్లాలోని వృద్దులు, దివ్యంగుల నుండి మంగళ, బుధవారాలలో హోమ్ ఓటింగ్ నిర్వహించామని కలెక్టర్ వివరించారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం, రిసెప్షన్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ తెలిపారు. శిక్షణ కేంద్రాల వద్దే ఫెసిలిటేష్ సెంటర్ లను ఏర్పాటు చేసి పోలింగ్ విధులూ నియమింపబడిన సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా ఏర్పాటు చేశామన్నారు.
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబందించిన అంశాలను జిల్లా యంత్రాంగం దృష్టికి తెచ్చే విధంగా సి-విజిల్ యాప్ పై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని, ఈ యాప్ థ్ పాటు 1950 వచ్చే ఫిర్యాదులను వెనువెంటనే పరిష్కరిస్తున్నామని కలెక్టర్ వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ చంద్ర మోహన్, డిపిఓ శ్రీనివాస్ రావు, డీఎల్.పిఓ సాయిబాబ ఎన్నికల విభాగపు పర్యవేక్షకులు తదితరులున్నారు.