11 మంది ఫోన్ల రికవరీ

బాన్సువాడ, నవంబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

బాన్సువాడ పట్టణ సీఐ కార్యాలయంలో బుధవారం సిఐ మహేందర్‌ రెడ్డి సిఐఈఆర్‌ పోర్టల్‌ ద్వారా రికవరీ చేసిన ఫోన్లను బుధవారం 11 మంది బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల నుండి పాత ఫోను కొనుగోలు చేయరాదని ఫోన్‌ దొరికిన వెంటనే సంబంధిత పోలీస్‌ స్టేషన్లో అప్పగించాలని, సైబర్‌ మోసాలకు గురికాకుండా తగుజాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఫోన్‌ రికవరీలో సిఐఈఆర్‌ ఆపరేటర్‌ రాజేష్‌ను సిఐ అభినందించారు. ఫోన్‌ రికవరీ చేయడంలో కేసులను త్వరితగతిన పరిష్కరించిన పోలీస్‌ సిబ్బందిని ఆయన అభినందించారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »