రెండు అక్షరాల పదం దేశ భవిష్యత్తును మార్చేస్తుంది

ఆర్మూర్‌, నవంబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ప్రజాస్వామ్యానికి ఓటే పునాది అని సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఫీల్డ్‌ పబ్లిసిటీ ఆఫీసర్‌ బి.ధర్మ నాయక్‌ అన్నారు. గురువారం ఆర్మూర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఆధ్వర్యంలో ఓటర్ల అవగాహన సదస్సు నిర్వహించారు.

సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఫీల్డ్‌ పబ్లిసిటీ ఆఫీసర్‌ బి ధర్మ నాయక్‌ మాట్లాడుతూ… ప్రజాస్వామ్యానికి ఓటే పునాది అని, ఓటు అనే రెండు అక్షరాల పదం దేశ భవిష్యత్తును మార్చేస్తుందని అన్నారు. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులందరికి భారత రాజ్యాంగం ఓటు హక్కును కల్పించిందని, కాబట్టి అర్హులందరు ఓటు హక్కును ఉపయోగించుకోవాలని తెలిపారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా ఓటు వేసేలా అవగాహన కల్పించాలని, విస్తృత ప్రచారం చేయాలని విద్యార్థులకు సూచించారు.

స్వీప్‌ జిల్లా నోడల్‌ అధికారి సురేష్‌ మాట్లాడుతూ.. మీ గ్రామాల్లో ఓటు హక్కుపై ప్రజలను చైతన్య వంతులను చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారత ఎన్నికల సంఘం సూచించిన మేరకు ఓటు ప్రాధాన్యాన్ని గురించి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, ప్రజలకు వివరించి ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చూడాలని అన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా స్వేచ్ఛగా ఈ నెల 30న జరిగే పోలింగ్‌లో ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు.

డిఆర్‌ డిఓ పిడి చందర్‌ మాట్లాడుతూ.. ఓటు అనే రెండు అక్షరాల పదం దేశ భవిష్యత్తును మార్చేస్తుందన్నారు. డెమోక్రసీని కాపాడుకోవాలంటే ఒకే ఒక్క ఆయుధం ఓటు అన్నారు. ఒక ఓటు ఒక మంచి సమాజాన్ని సృష్టిస్తుందన్నారు. ఓటు వజ్రాయుధం అందుకే అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు అవసరన్నారు. ప్రజాస్వామ్య మనుగడకు ఓటుహక్కే ఆధారమన్నారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ల మన డెమోక్రసీ ఇంత గట్టిగా నిలబడడానికి కారణం మన రాజ్యాంగమన్నారు. చాలా దేశాలలో సివిల్‌ రైట్స్‌ లేవన్నారు. దేశపౌరునికి దేశం ఇచ్చిన గొప్ప బహుమతి ఓటు హక్కు అని తెలిపారు.

జిల్లా మహిళా సంక్షేమ అధికారి ఎస్‌ కె రసూల్‌ బీ మాట్లాడుతూ… ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా ఓటు వేసేలా అవగాహన కల్పించాలన్నారు. మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకొనే శక్తి ఓటు ద్వారా మాత్రమే సాధ్యమవుతుందన్నారు. అందువల్ల ఓటు వివేకంతో, విజ్ఞతతో వేయాల్సిన బాధ్యత పౌరులపై ఉందన్నారు. మనల్ని పాలించే అవకాశాన్ని మంచి వారికి, సమర్ధులకు ఇవ్వడం ద్వారా ఇది సాధ్యపడుతుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో, ప్రజాస్వామ్య మనుగడకు ఓటుహక్కే కీలకమని స్పష్టం చేశారు.

అదే విదంగా నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్‌ శైలీ బెల్లాల్‌ మాట్లాడుతూ…. ఓటు ఎంతో విలువైనది, శక్తివంతమైనదని, ఓటు ద్వారా మంచి నాయకుని ఎన్నుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మీ గ్రామాల్లో ఓటు హక్కుపై ప్రజలను చైతన్య వంతులను చేసి ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని విద్యార్థులను కోరారు.

అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వేణుగోపాల్‌ స్వామి మాట్లాడుతూ…. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు చాలా విలువైనదని, దాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఓటును నిజాయితీగా వేయాలని ఎలాంటి బహుమతులు, మద్యం, డబ్బుకు తలొగ్గొద్దని హితవు పలికారు.

బహుమతులు ప్రదానం

ఓటుహక్కుపై నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస, రంగోలి పోటీల్లో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ముఖ్య అతిథిలు చేతులు మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. అంతకు ముందు సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఆధ్వర్యంలో కళాకారుల బృందం తమ పాటలతో ఓటు హక్కు పై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వేణుగోపాల్‌ స్వామి, డిఆర్‌ డిఓ పిడి చందర్‌, స్వీప్‌ జిల్లా నోడల్‌ అధికారి సురేష్‌, జిల్లా మహిళా సంక్షేమ అధికారి ఎస్‌ కె రసూల్‌ బీ, నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్‌ శైలీ బెల్లాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ రాజేష్‌, ఎన్‌ ఎస్‌ ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్లు యాదగిరి, వెంకటేశ్వర్లు, అనిత పవర, సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ యప్‌ పిఏ రషీద్‌, ఎంటిఎస్‌ పోచయ్యా, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »