కామారెడ్డి, నవంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తమ ఓటు హక్కు వినియోగించుకొనుటకు వీలుగా జిల్లా కేంద్రంలో ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ తెలిపారు.
ఈ ఫెసిలిటేషన్ కేంద్రాలు ఈ నెల 28 వరకు ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయని అన్నారు. జుక్కల్, ఎల్లారెడ్డి నియోజక వర్గాలకు సంబంధించి కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో, కామారెడ్డి నియోజక వర్గానికి సంబంధించి కామారెడ్డి ఆర్డీఓ కార్యాలయంలో ఫెస్టిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
అదేవిధంగా ఈ జిల్లాలో పనిచేస్తూ ఇతర జిల్లాలలో ఓటు హక్కు కలిగి ఉండి ఫారం-12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తు చేసిన ప్రతిపాదనలన్నింటిని సంబంధిత జిల్లాలకు పంపామని వారంతా కలెక్టరేట్ లోని 25 నెంబరు గదిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫెసిలిటేషన్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకోవలసినదిగా కలెక్టర్ కోరారు. సందేహాల నివృత్తి కోసం 9494261915, 9052465700 నెంబర్లను సంప్రదించవలసినదిగా సూచించారు.