30న వేతనంతో కూడిన సెలవు

నిజామాబాద్‌, నవంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

రాష్ట్ర శాసన సభకు ఈ నెల 30 న పోలింగ్‌ జరగనున్న సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించిందని జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నెల 30 న గురువారం అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు, పరిశ్రమలకు వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించారని కలెక్టర్‌ తెలిపారు. కాగా పోలింగ్‌ కేంద్రాలుగా, డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లుగా ఎన్నికల నిర్వహణలో భాగంగా వినియోగిస్తున్న విద్యా సంస్థలకు, ప్రభుత్వ సంస్థలకు ఈ నెల 29న కూడా సెలవు దినంగా ప్రకటిస్తూ స్థానికంగా ఉత్తర్వులు జారీ చేశామన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »