రెండు రోజులు కీలకం…

కామారెడ్డి, నవంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

పోలింగ్‌ అధికారులు ఈ.వి.ఏం. యంత్రాలను, పోలింగ్‌ మెటీరియల్‌ను చెక్‌లిస్ట్‌ ప్రకారం సరిచూసుకుని తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు తరలి వెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ సూచించారు. బుధవారం జుక్కల్‌, యెల్లారెడ్డి, కామారెడ్డి నియోజక వర్గాలలోని డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలను పరిశీలించి పోలింగ్‌ సిబ్బందికి, అధికారులకు తగు సూచనలు ఇచ్చారు.

పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్లి ప్రతి బస్సుకు జి.ఫై.ఎస్‌. ట్రాకింగ్‌ ఏర్పాటు చేశామని, తిరిగి రిసిప్షన్‌ కేంద్రాలకు వచ్చిన తరువాత క్లోజ్డ్‌ కంటైనెర్‌ల ద్వారా స్ట్రాంగ్‌ రూమ్‌ లకు జి.పి .ఎస్‌. ట్రాకింగ్‌ ద్వారా తరలిస్తామన్నారు. పోలింగ్‌ సిబ్బంది ఎట్టి పరిస్థితులలోను తమకు కేటాయించిన కేంద్రాలలోనే బస చేయాలని, ఓటు గోప్యతకనుగుణంగా పోలింగ్‌ కేంద్రంలో కంపార్ట్మెంట్‌, సిబ్బంది, ఏజెంట్లు కూర్చునే విధంగా సిట్టింగ్‌ ఏర్పాటు చేసుకొని అవసరమైన ఫారాలను సిద్ధం చేసుకొని ఉదయం 5. 30 గంటలకు పోలింగ్‌ ఏజెంట్‌ల సమక్షంలో మాక్‌ పోలింగ్‌ నిర్వహించి క్లియర్‌ చేయాలని సూచించారు.

అనంతరం కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూమ్‌ను సందర్శించి ఈ రెండు రోజులు అత్యంత కీలకమని ఎలక్ట్రానిక్‌ మీడియా, సామాజిక మాధ్యమాలలో వచ్చే వార్తలను నిశితంగా పరిశీలిస్తు ఓటింగ్‌ సరళికి సంబంధించి పుకార్లు, అసత్య వార్తలు ప్రసారమవుతుంటే వెంటనే సంబంధిత అధికారులకు తెలుపుతూ వాటి నిలుపుదలకు చర్యలు తీసుకోవాలన్నారు.

పోలింగ్‌కు సంబంధించి ఓటింగ్‌ సరళిని వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పరిశీలిస్తూ ఎటువంటి చిన్న సంఘటన దృష్టికి వచ్ఛోనా వెంటానే తెలపాలన్నారు. అనంతరం కౌంటింగ్‌ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈసారి ప్రతి టేబుల్‌ దగ్గర ఓట్ల లెక్కింపును సి.సి.కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నామని, కౌంటింగ్‌ హాల్‌లో రౌండ్‌ వారీగా ఫలితాలను రిటర్నింగ్‌ అధికారి ప్రకటించేలా చూడాలని, పోలింగ్‌ ఏజెంట్‌లకు తగు వసతులు కల్పించాలన్నారు.

స్ట్రాంగ్‌ రూమ్‌లో, కౌంటింగ్‌ హాల్‌లో నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా ఉండేలా చూడవలసినదిగా విద్యుత్తు అధికారులకు సూచించారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి రౌండ్‌ వారీగా ఫలితాలను ఎప్పటికప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసున్న మీడియాకేంద్రంలో పాత్రికేయులకు అందించేలా చూడాలని అధికారులకు సూచించారు.

కార్యక్రమాలలో రిటర్నింగ్‌ అధికారులు మను చౌదరి, మన్నె ప్రభాకర్‌, శ్రీనివాస్‌ రెడ్డి, నోడల్‌ అధికారులు సింహ రావు, దయానంద్‌, సతీష్‌ యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »