ఆపరేషన్‌ నిమిత్తం బాలుడికి రక్తదానం

కామారెడ్డి, నవంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

కామారెడ్డి జిల్లా లింగంపేట్‌ మండలం బూరుగిద్ద ఎల్లమ్మ తండా చెందిన మనోజ్‌ కుమార్‌ (10) గురుకుల పాఠశాల విద్యార్థికి ప్రభుత్వ వైద్యశాలలో ఆపరేషన్‌ నిమిత్తమై ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో ప్రభుత్వ వైద్యశాలలో వారికి కావాల్సిన రక్తము లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ రాష్ట్ర చైర్మన్‌ మరియు రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు.

దీంతో వారికి కావాల్సిన ఓ పాజిటివ్‌ రక్తాన్ని సకాలంలో అందజేయడం జరిగిందని అన్నారు. మానవతా దృక్పథంతో రక్తదానానికి ముందుకు రావాలని, రక్తదానం చేయడం అంటే తోటి వారి ప్రాణాలను కాపాడడమనే భావనను ప్రతి ఒక్కరు గుర్తుతెరగాలన్నారు. రక్తదానం చేయాలనుకున్నవారు వారి యొక్క వివరాలను 9492874006 నెంబర్‌ కు పంపించగలరని తెలిపారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »