ఆర్మూర్, జూలై 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం ఆర్మూర్ మండల కార్యవర్గ సమావేశం ఆర్మూర్ మండలం దేగాం గ్రామంలో ఆర్మూర్ మండల బీజేపీ అధ్యక్షుడు రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించి, జ్యోతి ప్రజ్వలన చేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ప్రధాన కార్యదర్శి, కార్పోరేటర్ న్యాలం రాజు మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో బీజేపీ గెలుపే ద్యేయంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాల్సిన అవసరముందన్నారు. అలాగే బూతు కమిటీలు, మోర్చాల కమిటీలు, శక్తి కేంద్ర ఇంచార్జులను గ్రామ స్థాయిలో బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జ్ పోద్దుటూరి వినయ్ రెడ్డి, బీజెవైయం మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, సెలక్షన్ కమిటీ మెంబర్ ఆమ్దాపూర్ రాజేష్, ఆర్మూర్ మండల ఇంచార్జ్ నాగులపల్లి రాజేశ్వర్, మండల ప్రధాన కార్యదర్శులు రవిగౌడ్, వినోద్, శ్రీనివాస్, రాజ్ కుమార్, శిరీష నవీన్, లావణ్య శ్రీనివాస్, ఎర్రవ్వ ముఖేష్, జిల్లా బీసీ మోర్చా ఉపాధ్యక్షులు సురేష్ యాదవ్, సీనియర్ నాయకులు నక్కల భూమా రెడ్డి, అన్ని మోర్చాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అన్ని గ్రామాల బూతు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.