ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ప్రపంచ ఎయిడ్స్‌ దినం 2023 పురస్కరించుకొని శుక్రవారం ప్రభుత్వ గిర్‌రాజ్‌ కళాశాల ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా సీనియర్‌ జడ్జి మరియు సెక్రటరీ లీగల్‌ సర్వీస్‌ అథారిటీ పద్మావతి మాట్లాడుతూ ప్రస్తుతం హెచ్‌ఐవి తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉన్నప్పుడే మనం హెచ్‌ఐవిని నివారించ కలుగుతామని అన్నారు.

దీని కొరకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. అలాగే హెచ్‌ఐవి సోకిన వారి పట్ల వివక్ష లేకుండా ఉండాలి అని వారి హక్కులు భంగం కలగకూడదని అని అన్నారు. అలాగే మా వంతు కృషిగా ఈ సంవత్సరం ట్రాన్స్‌ జెండర్స్‌ ఇద్దరికి, సెక్స్‌ వర్కర్స్‌కు ఉద్యోగాలు అలాగే లేబర్‌ కార్డ్స్‌ ఇప్పించడం జరిగిందని పేర్కొన్నారు.

అలాగే జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ ఎం. సుదర్శనం మాట్లాడుతూ జిల్లాలో గతంలో 5.4 శాతం నుండి 0.39 వరకు తగ్గించగలిగామని అలాగే తల్లి నుంచి బిడ్డకు రాకుండా కాపాడగలుగుతున్నామని అలాగే ముందు ముందు జీరో హెచ్‌ఐవి దిశగా జిల్లాను చేయడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. అలాగే ప్రపంచ ఎయిడ్స్‌ దినంలో భాగంగా కళాశాల విద్యార్థులకు ఉపన్యాస పోటీలు, పోస్టర్‌ మేకింగ్‌, రంగోలి కార్యక్రమాలు నిర్వహించి జడ్జి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.

కార్యక్రమంలో ఏసిపి కిరణ్‌ కుమార్‌, జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రతిమ రాజ్‌, డిడబ్ల్యుఓ రసూల్‌ భి, జైలరు రాజశేఖర్‌ రెడ్డి, ఎన్‌వైకె కోఆర్డినేటర్‌ శైలి బెళ్ళల్‌, డాక్టర్‌ దివ్య, డిప్యూటి డిఎం అండ్‌ హెచ్‌వో, కళాశాల ప్రిన్సిపల్‌ రామ్మోహన్‌, అంతుల్‌, అనుపమ, స్నేహ సొసైటీ పిడి సిద్ధయ్య, అలాగే నిజాం అభయ, వర్డ్‌, చైల్డ్‌ ఫండ్‌ ఇండియా, సూర్య ఆరోగ్య సంస్థ, సాథి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ సిబ్బంది జిల్లా ఎయిడ్స్‌ నివారణ మరియు నియంత్రణ సంస్థ సిబ్బంది పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »