డాక్టర్‌ హెడ్గేవార్‌ స్మృతి మందిర నిర్మాణానికి భూమి పూజ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

శ్రీ కేశవ సేవా సమితి ఆధ్వర్యంలో కందకుర్తిలో శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు స్వామి కమలానంద భారతి చేతుల మీదుగా డాక్టర్‌ హెడ్గేవార్‌ స్మృతి మందిర నిర్మాణానికి శనివారం ఉదయం 11 గంటలకు భూమి పూజ వైభవంగా జరిగింది.

1925లో స్థాపించబడిన రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘానికి 2025 నాటికి 100 సంవత్సరాలు పూర్తవుతున్న శుభ సందర్భంలో సంఘ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సంఘస్థాపకులు పరమ పూజనీయ డాక్టర్‌ హెడ్గేవార్‌ యొక్క పూర్వీకుల గ్రామమైన కందకుర్తిలో వివిధ సేవా కార్యక్రమాల నిర్వహణ కోసము పాఠశాల, ఆవాసము, స్మృతి మందిరము, యువతకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, అందులో భాగంగానే డాక్టర్‌ హెడ్గేవార్‌ యొక్క స్మృతి మందిరాన్ని అధునాతన హంగులతో నిర్మించనున్నట్లు కేశవ సేవాసమితి కార్యదర్శి అంకు మహేష్‌ తెలిపారు.

కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు పూజ స్వామి కమలానంద భారతి మాట్లాడుతూ కందకుర్తి తమకేంతో పవిత్రమైన స్థలమని కందకుర్తికి ఎంతో ప్రాచీన చరిత్ర ఉన్నదని భక్తికి పుట్టినిల్లు అని స్వామీజీ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కందకుర్తి ఒక పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా ఒక సామాజిక వికాస కేంద్రంగా కూడా విలసిల్లుతుందని కందకుర్తిలో సాక్షాత్తు స్కందుడే స్వయంగా కొలువై ఉన్నాడని అలాగే త్రివేణి సంగమ క్షేత్రంగా కందకుర్తి అత్యంత పవిత్రమైన స్థానమని శతాబ్ద కాలం నాటి రామాలయం గోదావరి ప్రవాహం ఒడ్డున స్వయంభుగా వెలసిన అమృతేశ్వరుడు అంతేకాకుండా అయోధ్య నుంచి వచ్చిన సాధు పుంగవులు శ్రీ సీతారాం త్యాగి మహారాజ్‌ నిర్మించిన శని దేవాలయము వంటి ఎన్నో ఆధ్యాత్మిక పవిత్ర క్షేత్రాలకు కందకుర్తి చిరునామాగా నిలుస్తుందని రాబోయే కొద్ది కాలంలోనే కందకుర్తి విశ్వఖ్యాతిని ఘటిస్తుందని కందకుర్తి గ్రామంలో పుట్టిన ప్రజలందరూ ఎంతో అదృష్టవంతులని ఈ గ్రామాన్ని సర్వతో ముఖాభివృద్ధి చేయటం కోసం ముందుకు వచ్చిన కేశవ సేవా సమితి యొక్క బృందాన్ని సేవా భారతి సంస్థను అభినందిస్తున్నట్లు తెలిపారు.

తప్పకుండా ఈ గ్రామానికి మంచి చేయాలనే ఆలోచనతో నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టులన్ని విజయవంతంగా పూర్తవుతాయని ఆశిస్తున్నట్లు స్వామీజీ వ్యాఖ్యానించారు.

కార్యక్రమంలో మల్లారం శ్రీ లింగేశ్వర గుట్ట ఆశ్రమాధిపతి పిట్ల కృష్ణ మహారాజు, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాంత సంఘచాలక్‌ బూర్ల దక్షిణామూర్తి, పొన్నపల్లి సోమయాజులు, విభాగ్‌ ప్రచారక్‌ నర్రా వెంకట శివకుమార్‌, ఎండల లక్ష్మీనారాయణ దిలీప్‌ శాస్త్రి, మంగళ వేణుగోపాల్‌, కేశవ సేవా సమితి అధ్యక్షులు చామకూర సుధాకర్‌ రెడ్డి, కార్యదర్శి అంకు మహేష్‌, ప్రాంత సేవా భారతి ప్రముఖ్‌ వాసు తదితరులు పాల్గొన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »