కామారెడ్డి, డిసెంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో కుమ్మరి బాలయ్య (45) దేవునిపల్లి గ్రామానికి చెందిన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరమని వారి కుటుంబ సభ్యులు ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. దీంతో దోమకొండ మండల కేంద్రానికి చెందిన రక్తదాత సురేందర్ వెంటనే స్పందించి కామారెడ్డి ప్రభుత్వ వైద్యశాలలోని రక్తనిధి కేంద్రంలో సకాలంలో రక్తాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రస్తుతం కామారెడ్డి ప్రభుత్వ వైద్యశాలలోని రక్తనిధి కేంద్రంలో రక్త నిలువలు లేకపోవడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి కావాల్సిన రక్తం దొరకకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మానవతా దృక్పథంతో రక్తదానానికి ముందుకు రావాలని, రక్తదానం చేయాలనుకునేవారు సంప్రదించాలన్నారు.
రక్తదానం చేసిన రక్తదాతకు ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తరఫున అభినందనలు తెలిపారు.