బాన్సువాడ, డిసెంబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో మంగళవారం అవిఘ్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్ డి.ఎస్.పి, జగన్నాథ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవిజ్ఞ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని, సామాజిక సేవా కార్యక్రమాలకు తమ పూర్తి సహకారం ఎల్లప్పుడు ఉంటుందని అవిఘ్న ఫౌండేషన్ సభ్యులను అభినందించారు.
కార్యక్రమంలో సింధు పాఠశాల కరస్పాండెంట్ జ్ఞానేశ్వర్, ఆసుపత్రి సూపర్డెంట్ శ్రీనివాస్ ప్రసాద్, డి.ఎస్.పి జగన్నాథ రెడ్డి, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.