కామారెడ్డి, డిసెంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి కలెక్టరేట్ లోని ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ లను బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. ఇటీవలజరిగిన శాసనసభ ఎన్నిలకు సంబందించి జిల్లాలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాలలో వివి.ఫ్యాట్ లో పోలైన ఓటు స్లిప్పులను ఇక్కడ భద్రపరిచినట్లు చెప్పారు.
అనంతరం కలెక్టరేట్ లోని మినీ సమావేశమందిరంలో త్వరలో స్థానిక సంస్థలకు జరగబోయే ఎన్నికల దృష్ట్యా నూతనంగా ఓటరునమోదు పై విస్తృత అవగాహన నిమిత్తం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన యువతి, యువకులు ఆన్లైన్ ద్వారా కొత్త ఓటర్లుగా నమోదు చేసుకునేలా అవగాహన కలిగిస్తూ ప్రోత్సహించాలని కోరారు.
ఓటరు జాబితాలో మార్పులు, చేర్పుల కోసం బూతులెవల్ అధికారులకు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. 2024 జనవరి 6న ముసాయిదా జాబితా ప్రకటన ఉంటుందని, 2024ఫిబ్రవరి 8న తుది ఓటరుజాబితా ప్రకటించడం జరుగుతుందని చెప్పారు.
సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రభాకర్ రెడ్డి, బాలరాజు, జాఫర్ ఖాన్, రషీద్ ఖాన్, కాసీం అలీ, కామారెడ్డి ఆర్డిఓ శ్రీనివాస్ రెడ్డి, ఎన్నికల విభాగం అధికారులు అనిల్ కుమార్, ఇందిరా ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.