నిజామాబాద్, డిసెంబర్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బోర్గం(పి) ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తినడం ద్వారా అస్వస్థకు గురైన విద్యార్థులను ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్‌యు) ప్రతినిధులు పరామర్శించారు.
ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్క గణేష్ మాట్లాడుతూ, బోర్గం (పి) ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినడం ద్వారా అస్వస్థకు గురయ్యారు, వారికి వెంటనే మంచి వైద్య సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. గత పాలకవర్గం కెసిఆర్ ప్రభుత్వం విద్యార్థులపై చిన్న చూపు చూశారని తెలిపారు. మరి కొత్త ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.
విద్యార్థులు అస్వస్థకు గురికావడానికి మధ్యాహ్న భోజన సంబందించిన కారకులపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకం సంబంధించి సరిపడా నిధులు కేటాయించి నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇటువంటి సంఘటనలు జరగకుండా జిల్లా అధికారులు, ప్రభుత్వం కారాకులపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. ఆయన వెంట పి.డి.ఎస్.యు. నాయకులు సందీప్, సలీం, అనిల్, సాయికిషన్, పవన్ ఉన్నారు.