కామారెడ్డి, డిసెంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి పనులు చేపట్టాలని జెడ్పి చైర్ పర్సన్ శోభ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం చైర్ పర్సన్ శోభ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ శోభ మాట్లాడారు.
బీబీపేట, కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి, నస్రుల్లాబాద్ మండలం సంఘెం, సదాశివ నగర్ మండలం తిమ్మాజివాడి, బిక్కనూరు మండలం తిప్పాపూర్ ఇంగ్లీష్ మీడియం ఉచ్చతర ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలలు మార్చడానికి జెడ్పి పాలకవర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఎనిమిదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు పెంచుటకు సభ్యులు అంగీకారం తెలిపినట్లు పేర్కొన్నారు.
ఉపాధి హామీ పథకం నిధులతో 30 గ్రామపంచాయతీ కొత్త భవనాలు నిర్మించడానికి సభ్యులు అంగీకరించారని తెలిపారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు. ఉపాధి హామీ పథకం, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్, వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖల పై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జెడ్పి సీఈవో సాయ గౌడ్, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.