కామారెడ్డి, డిసెంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
పనిచేయని కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వి వి ప్యాడ్ యంత్రాలను శుక్రవారం ఈసీఐసి హైదరాబాద్ కు పంపినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు.
శుక్రవారం ఆయన కామారెడ్డి లోని స్ట్రాంగ్ రూమ్‌ను, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌కు తాళం వేసి సీజ్ చేశారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.