కామారెడ్డి, డిసెంబర్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
హైకోర్టు జడ్జి లక్ష్మీనారాయణ శనివారం కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహానికి వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ సింధు శర్మ, కామారెడ్డి కోర్టు న్యాయమూర్తి శ్రీదేవి మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు మొక్కలను అందించారు.
అనంతరం ఆయన కామారెడ్డి కోర్టులో ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభించారు. కోర్టులో పెండిరగ్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరో కొత్త కోర్టు మంజూరు అయినందున ఏర్పాటు కోసం గదులను పరిశీలించారు.