కామారెడ్డి, డిసెంబర్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తూ అందుబాటులోకి తెచ్చిన మహాలక్ష్మి పథకాలను ఆదివారం జిల్లాలోని కామారెడ్డి, యెల్లారెడ్డి, జుక్కల్, బాన్సవాడ నియోజక వర్గాలలో ఉదయం 11 గంటలకు ప్రారంభించానున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
కామారెడ్డ్డి నియోజక వర్గంలోని దోమకొండ లో పి .హెచ్.సి నందు ఆరోగ్య శ్రీ పధకాన్ని, బస్టాండ్‌లో మహిళలలకు, ట్రాన్స్ జెండర్లకు ఉఛిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభిస్తారని కలెక్టర్ తెలిపారు. యెల్లారెడ్డి నియోజక వర్గంలోని తహసీల్ధార్ కార్యాలయం వద్ద ఆరోగ్య శ్రీ, ఉచిత , సర్వీసు బస్సును, జుక్కల్ నియోజక వర్గంలోని పిట్లం పి .హెచ్.సి లో ఆరోగ్య శ్రీ పధకాన్ని, బాస్ స్టాండ్ వద్ద ఉచిత బస్సు సౌకర్యాన్ని, బాన్సువాడ నియోజక వర్గంలోని ఏరియా ఆసుపత్రి నందు పెంచిన ఆరోగ్య శ్రీ సాయం 10 లక్షల పధకాన్ని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రార్సంబిసస్తారని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ పధకాలను సద్వినియోగం చేసుకోవలసినదినాదిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.