డిచ్‌పల్లి, డిసెంబర్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెలలో జరిగే డిగ్రీ పరీక్షల నిర్వహణ గురించి కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ సెమినార్ హాలులో జరిగిన డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్ మీటింగుకు ముఖ్యఅతిథిగా రిజిస్ట్రార్ ఆచార్య.యం. యాదగిరి హాజరైనారు.
ఆచార్య.యం.యాదగిరి మీటింగ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ కట్టుదిట్టంగా ఉండాలని కళాశాల పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, సౌకర్యవంతమైన సీటింగ్ అరేంజ్మెంట్‌తో పాటు తాగునీరు సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు.
పరీక్షలు సమయపాలన పాటిస్తూ కళాశాల యాజమాన్యం మాల్ ప్రాక్టీస్‌కు సహకరించకుండా తెలంగాణ విశ్వవిద్యాలయ పరీక్షల నిబంధనలను పాటించాలని తెలిపారు.
ఈ సందర్భంగా పరీక్షల నియంత్రణ అధికారిని ఆచార్య.ఏం అరుణ మాట్లాడుతూ కళాశాలలకు కావలసిన స్టేషనరీ ముందస్తుగా విశ్వవిద్యాలయం నుండి పొందాలని సూచించారు.
కార్యక్రమంలో ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య గంటా చంద్రశేఖర్, అడిషనల్ కంట్రోలర్ డాక్టర్.బి.సాయిలు, డాక్టర్ బి.నందిని, పి.డాక్టర్ శాంతాబాయి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ విజయలక్ష్మి, అన్ని కళాశాలల ప్రిన్సిపల్స్, తెలంగాణ విశ్వవిద్యాలయ పరీక్షల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.